Rajamouli: విశ్వమా.. కాస్త గ్యాప్ ఇవ్వమ్మా!
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ పురస్కారం లభించడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani)కి పద్మశ్రీ పురస్కారం (Padma Shri Awards) లభించడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) కూడా తనదైన శైలిలో ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ కీరవాణితో ఉన్న ఫొటోను పంచుకున్నారు. ‘‘నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాలని మీ అభిమానులందరిలాగే నేనూ భావిస్తున్నాను. కానీ ఈ విశ్వం ఒక వ్యక్తి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఊహించని రీతిలో అందిస్తుందని మీరు చెప్పే మాటలను గుర్తుపెట్టుకుంటాను. ఒకవేళ నాకు ఈ విశ్వంతో మాట్లాడే అవకాశం వస్తే..‘కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా, ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక మరొకటి ఇవ్వు’ అని చెబుతాను. నా పెద్దన్న కీరవాణికి పద్మశ్రీ పురస్కారం రావడం ఆనందంగా, గర్వంగా ఉంద’’ని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు రాజమౌళి.
పౌర పురస్కారం...గొప్ప గౌరవం: కీరవాణి
తనకు పద్మశ్రీ పురస్కారం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి. ‘‘భారత ప్రభుత్వం నుంచి పౌర పురస్కారం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులు, నన్ను ప్రోత్సహించిన కవితాపు సీతన్న గారు మొదలు..కుప్పాలా బులిస్వామినాయుడు గారి వరకూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’’అని ట్వీట్ చేశారు కీరవాణి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
ఉదయం ప్రజాప్రతినిధి.. మధ్యాహ్నం కూలీ
-
Sports News
ధోని కెప్టెన్సీ పేలవం: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్
-
Movies News
భయపెట్టేందుకు బరిలోకి ఎన్టీఆర్
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
-
World News
UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!