Rajamouli: ఇది సరైన సమయం

మహేష్‌బాబుతో చేయనున్న సినిమా గురించి దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మరోసారి మనసు విప్పారు. సాహసోపేతంగా సాగే కథల్లో మహేష్‌ కనిపిస్తే చాలా బాగుంటుందని, ఎప్పట్నుంచో నా మనసులో ఉన్న అలాంటి సినిమానే ఆయనతో  చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

Updated : 30 Nov 2022 06:44 IST

మహేష్‌బాబుతో (MaheshBabu) చేయనున్న సినిమా గురించి దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (Rajamouli) మరోసారి మనసు విప్పారు. సాహసోపేతంగా సాగే కథల్లో మహేష్‌ కనిపిస్తే చాలా బాగుంటుందని, ఎప్పట్నుంచో నా మనసులో ఉన్న అలాంటి సినిమానే ఆయనతో  చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ ‘‘నాకు ‘ఇండియానా జోన్స్‌’ సిరీస్‌ తరహా సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఉంది. ఆ సిరీస్‌ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సినిమా చేయడానికి ఇది సరైన సమయం అనిపించింది. అందుకే గ్లోబ్‌ ట్రాటింగ్‌ అడ్వంచరస్‌ సినిమాగా ఆ ప్రాజెక్టుని తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. మహేష్‌బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కనుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని