Rajamouli: దర్శక దేవుడిని కలిశా

ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెలుగులో అగ్ర దర్శకుడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సంచలన విజయంతో గ్లోబల్‌స్టార్‌గా మారారు. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ హాలీవుడ్‌లో దిగ్దర్శకుడు. ఈ ఇద్దరు దిగ్గజాల కలయికకి అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ వేదికైంది.

Updated : 15 Jan 2023 07:01 IST

స్‌.ఎస్‌.రాజమౌళి (Rajamouli) తెలుగులో అగ్ర దర్శకుడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సంచలన విజయంతో గ్లోబల్‌స్టార్‌గా మారారు. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (steven spielberg) హాలీవుడ్‌లో దిగ్దర్శకుడు. ఈ ఇద్దరు దిగ్గజాల కలయికకి అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌ వేదికైంది. ముందునుంచీ స్పీల్‌బర్గ్‌కి పెద్ద అభిమాని అయిన రాజమౌళి స్పీల్‌బర్గ్‌తో కాసేపు పిచ్చాపాటీ మాట్లాడారు. అనంతరం ‘ఇప్పుడే దర్శక దేవుడిని కలిశా’నంటూ శనివారం సామాజిక మాధ్యమాల్లో తన సంతోషం పంచుకున్నారు. దాంతోపాటు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, స్పీల్‌బర్గ్‌లతో కలిసి ఉన్న ఒక ఫొటోని షేర్‌ చేశారు. మరోవైపు కీరవాణి సైతం ‘సినిమా దేవుడు స్పీల్‌బర్గ్‌ని కలవడం ఒక గౌరవంగా భావిస్తున్నా. ఆయన దర్శకత్వం వహించిన ‘డ్యుయెల్‌’ సహా ఎన్నో సినిమాలు నాకిష్టమనే వార్తని ఆయన చెవిన చేరవేశా’నన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని