Rajamouli: ‘RRR’ కోసమే నిన్న జగన్‌ని కలిశా: రాజమౌళి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో సోమవారం ప్రత్యేకంగా భేటీ కావడంపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలని దృష్టిలో ఉంచుకునే తాను ముఖ్యమంత్రితో భేటీ అయ్యానని చెప్పారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై ప్రభుత్వం సానుకూలంగా....

Published : 15 Mar 2022 18:30 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సోమవారం ప్రత్యేకంగా భేటీ కావడంపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలని దృష్టిలో ఉంచుకునే తాను ముఖ్యమంత్రితో భేటీ అయ్యానని చెప్పారు. ‘RRR’ చిత్రంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ‘‘కరోనా, జీవో రద్దు కారణంగా గడిచిన కొంతకాలం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పలువురు సినీ ప్రముఖులతో పాటు నేను కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ని కలిశాను. ఆయనతో మాట్లాడిన తర్వాత పరిస్థితులు అన్నీ చక్కబడతాయనే నమ్మకం కలిగింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల దృష్ట్యా శనివారం ప్రత్యేకంగా మరోసారి కలిశాను.‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరుతూ ఒక వినతి పత్రం అందచేశాం. అందులో ఎలాంటి రహస్యాలు లేవు. ఇప్పుడు మళ్లీ నేనేదో మాట్లాడి మీరు దాన్ని మరోలా రాసి అది మరో వివాదానికి తెరతీయడం నాకు ఇష్టం లేదు. పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో సీఎం సానుకూలంగానే స్పందించారు. ఇక బెనిఫిట్‌ షో విషయానికి వస్తే.. ఆంధ్రాలో ఇప్పటికే ఐదో షోకు అనుమతి ఇచ్చారు. అంటే కేవలం విడుదలైన ఒక్కరోజు మాత్రమే కాకుండా సినిమా ఆడినన్ని రోజులు బెనిఫిట్‌ షో వేసుకునే వెసులుబాటు ఉంది కదా’’ అని రాజమౌళి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని