RRR: అమెరికాలో ‘నాటు నాటు’ పాట ప్రస్తావించిన రాజమౌళి.. చప్పట్లతో మార్మోగిన ప్రాంగణం!

అమెరికాలో జరిగిన బియాండ్‌ ఫెస్ట్‌లో రాజమౌళి నాటు నాటు పాట గురించి ప్రస్తావించారు.

Updated : 07 Oct 2022 16:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత చలనచిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు పొందేలా చేసిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’‌. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్స్‌ వేయించారు కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌. ప్రపంచవ్యాప్తంగా సోషల్‌మీడియాను  ఈ పాట హోరెత్తించిన సంగతి తెలిసిందే. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది యువత కవర్‌ సాంగ్స్‌ చేసి ట్రెండ్‌ సృష్టించారు. ఇటీవల అమెరికాలో జరిగిన బియాండ్‌ ఫెస్ట్‌లో రాజమౌళి ఈ పాట గురించి ప్రస్తావించారు.

‘‘నా స్నేహితులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు. ఇక వాళ్లిద్దరూ కలిసి ఒకే పాటకు డ్యాన్స్ చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా  ఉంటాయి. ఆ పాట కోసం నేను ఒక సీన్‌ను క్రియేట్‌ చేసి స్టోరీలో భాగంగా ఆ పాట వచ్చేలా చూశా. ఇక ‘నాటు నాటు’ సాంగ్‌కు కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌. అతనికి డ్యాన్స్ అంటే ప్రాణం. 3 నిమిషాలకు పైన ఉన్న ‘నాటు నాటు’ సాంగ్‌ కోసం అతడు 100 సిగ్నేచర్‌ స్టెపులు వేయించారు. ఆ పాటకు డ్యాన్స్‌ వేసేటప్పటికి డ్యాన్సర్స్‌ అందరికీ కాళ్ల నొప్పులు వచ్చాయి’’ అని చెప్పారు. రాజమౌళి ఆ పాట గురించి  చెప్పగానే ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది.

రాజమౌళి మాట్లాడిన వీడియోను కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ‘‘నాకు ఆర్‌ఆర్‌ఆర్‌లో అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నా మీద విశ్వాసం ఉంచి సహకారం అందించినందుకు ధన్యవాదాలు’’అని రాశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని