Rajamouli: మహిళలే థియేటర్‌ నిర్వహించడం ఆనందంగా ఉంది: రాజమౌళి

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అగ్ర దర్శకుడు రాజమౌళి సందడి చేశారు. జిల్లా మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న

Updated : 12 Apr 2022 17:36 IST

ఆదిలాబాద్‌: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అగ్ర దర్శకుడు రాజమౌళి సందడి చేశారు. జిల్లా మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎయిర్‌ బెలూన్‌ థియేటర్‌ను సతీసమేతంగా సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. రాజమౌళి రాకను పురస్కరించుకొని థియేటర్ వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రాజమౌళి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం థియేటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొమురంభీమ్ చిత్ర పటానికి నివాళులర్పించారు. కొమురంభీమ్ వారసులను పేరుపేరున పలకరించిన రాజమౌళి... గాలిబుడగ థియేటర్‌లో జిల్లా అధికారులు, కొమురంభీమ్ వారసుల సమక్షంలో కొద్దిసేపు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వీక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలంతా కలిసి థియేటర్ కట్టడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా మహిళా సమాఖ్యలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడి అటవీ ప్రాంతంలోని అందమైన ప్రదేశాలను చూడటానికి మరోసారి ఆసిఫాబాద్ వస్తానని రాజమౌళి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని