Annaatthe: సూపర్‌స్టార్‌ అభిమానులకు స్పెషల్‌ ట్రీట్‌..!

సూపర్‌స్టార్‌ అభిమానులకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అన్నాత్తె’ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. అగ్రకథానాయకుడు రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని...

Published : 11 Sep 2021 02:52 IST

స్టైలిష్‌ లుక్‌లో రజనీకాంత్‌

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ అభిమానులకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘అన్నాత్తె’ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. అగ్రకథానాయకుడు రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం శుక్రవారం ఉదయం అభిమానులతో పంచుకుంది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదలైన ఈ పోస్టర్‌లో రజనీ సంప్రదాయ దుస్తుల్లో స్టైలిష్‌గా కనిపించారు. దీపావళి కానుకగా నవంబర్‌ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకాంత్‌కు జోడీగా నయనతార సందడి చేయనున్నారు. కీర్తిసురేశ్‌ , మీనా, ఖుష్బూ సుందర్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. సన్‌ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని