రాజశేఖర్ కొత్త చిత్రం ‘మర్మాణువు’

రాజశేఖర్ కథానాయకుడిగా తన కొత్త సినిమా టైటిల్‌ని ప్రకటించారు. మహాయాన మోషన్ పిక్చర్స్, పెగాసస్ సినీ కార్ప్ సంస్థలు కలిసి రూపొందిస్తున్న చిత్రానికి ‘మర్మాణువు’ అనే పేరును ఖరారు చేశారు. చిత్రానికి వెంకటేష్‌ మహా దర్శకత్వం వహిస్తున్నారు.

Published : 25 Mar 2021 23:57 IST

హైదరాబాద్‌: రాజశేఖర్ కథానాయకుడిగా తన కొత్త సినిమా టైటిల్‌ని ప్రకటించారు. మహాయాన మోషన్ పిక్చర్స్, పెగాసస్ సినీ కార్ప్ సంస్థలు కలిసి రూపొందిస్తున్న చిత్రానికి ‘మర్మాణువు’ అనే పేరును ఖరారు చేశారు. చిత్రానికి వెంకటేష్‌ మహా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’వంటి చిత్రాలను తెరకెక్కించారు. గురువారం వెంకటేశ్‌ మహా పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా టైటిల్‌తో పాటు పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం స్వరాలు అందిస్తున్నారు. విజయ ప్రవీణ పరుచూరి, శివాని, శివాత్మిక నిర్మాతలు. త్వరలోనే తారాగణంతో పాటు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. రాజశేఖర్‌ గతంలో ‘కల్కి’, ‘గరుడవేగ’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో అలరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని