Naresh: నరేశ్‌ ఎప్పుడూ నిత్య పెళ్లికొడుకే..: రాజేంద్రప్రసాద్‌

Naresh: సినీ నటుటు నరేశ్‌ నిత్య పెళ్లికొడుకు అంటూ రాజేంద్రప్రసాద్ ఫన్నీ కామెంట్స్‌ చేశారు.

Published : 22 Mar 2023 21:36 IST

హైదరాబాద్‌: సీనియర్‌ నటుడు నరేశ్‌ (Naresh) ఎప్పుడూ నిత్య పెళ్లికొడుకేనని అతను మామూలు కత్తి కాదని మరో నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) అన్నారు. వీరిద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule ). నందిని రెడ్డి దర్శకురాలు. సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ నాయకనాయికలుగా నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నరేశ్‌ గురించి రాజేంద్రప్రసాద్‌ ఫన్నీ కామెంట్స్‌ చేశారు. అందుకు నరేశ్‌ కూడా అదే స్థాయిలో స్పందిస్తూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

‘రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు. కానీ, ఇక్కడ ఇమిడాయి. మీరూ, నరేశ్‌ కలిసి ఒకే సినిమాలో నటించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని రాజేంద్రప్రసాద్‌ను అడగ్గా, ‘‘నేను కత్తి కాదు.. నరేశ్‌ కత్తి.. నేను ఒర. నేను ఎప్పుడూ బాగున్నదే చెబుతాను. వాడు మామూలోడు కాదు. మీ అందరికీ తెలుసు (నవ్వులు) ఆ రేంజ్‌ కత్తి మేము కాదు. చూశారా ఎప్పుడూ పెళ్లి కొడుకులానే ఉంటాడు’ అని వేదికపై ఉన్న నరేశ్‌ను చూపిస్తూ రాజేంద్రప్రసాద్‌ అనగా, అక్కడే ఉన్న నరేశ్‌ కుర్చీలో నుంచి లేచి వచ్చి, ‘పెళ్లి కొడుకులా ఉండటం ఏంటి? నిత్యం పెళ్లికొడుకునే’ అంటూ సమాధానం ఇవ్వడంతో నవ్వులు విరబూశాయి.

ఇక సినిమాలో వారిద్దరి పాత్రల గురించి చెబుతూ, కథా బలం వల్లే తామిద్దరం కలిసి నటిస్తున్నట్లు చెప్పారు. రెండు కుటుంబాల మధ్య కథ అని, యాక్టర్‌ బ్యాలెన్స్‌ జరిగిందని రాజేంద్రప్రసాద్‌ వివరించారు. తన తల్లి విజయ నిర్మల తర్వాత దర్శకురాలిగా నందినిరెడ్డి అంటే ఎంతో గౌరవమని నరేశ్‌ చెప్పుకొచ్చారు. పవిత్ర-నరేశ్‌లు వివాహం చేసుకున్నట్లు ఇటీవల విడుదలైన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. నరేశ్‌ స్వయంగా ఆ వీడియోను పంచుకోవడంతో మరింత ట్రెండ్‌ అయింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆ వీడియోను విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని