Rajendra prasad: కుల ప్రస్తావన తెస్తే ఎన్టీఆర్‌కు చాలా కోపం: నటుడు రాజేంద్రప్రసాద్‌

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ పుట్టిన నేలపై జన్మించడం అదృష్టమని ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

Updated : 28 May 2023 16:21 IST

హైదరాబాద్‌: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ పుట్టిన నేలపై జన్మించడం అదృష్టమని ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ఉండుంటే ఆయనకు బంగారు పూలతో పాదపూజ చేసేవాళ్లమన్నారు.

‘‘ఎన్టీఆర్‌ నాకు గురువు, దైవం. సినీ రంగంలో ఎంతో మందికి ఆయన సహాయం చేశారు. ప్రజలే దేవుళ్లు అనడమే కాదు.. వారిని అలాగే చూశారు. కుల ప్రస్తావన తెస్తే ఎన్టీఆర్‌కు చాలా కోపం. ఆయన శతజయంతికి ప్రపంచవ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారని తెలిసి చాలా సంతోషం కలిగింది. ఎన్టీఆర్‌ మనందరి వాడు. ఆయన గొప్పతనం భావితరాలకు తెలియజెప్పాలి’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని