Rajinikanth: ఆగస్ట్‌లో ఆరంభం

గతేడాది దీపావళికి ‘పెద్దన్న’గా ప్రేక్షకుల్ని పలకరించారు రజనీకాంత్‌. ఈ సినిమా తర్వాత ఆయన మరో కొత్త చిత్రమేదీ ప్రారంభించలేదు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.

Updated : 19 May 2022 06:55 IST

తేడాది దీపావళికి ‘పెద్దన్న’గా ప్రేక్షకుల్ని పలకరించారు రజనీకాంత్‌. ఈ సినిమా తర్వాత ఆయన మరో కొత్త చిత్రమేదీ ప్రారంభించలేదు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల దిలీప్‌ నుంచి వచ్చిన ‘బీస్ట్‌’ పూర్తిగా నిరుత్సాహపరచడంతో రజనీతో సినిమా ఉంటుందా? లేదా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం కోలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రజనీ కొత్త చిత్రం ఆగస్ట్‌లో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, పూర్వ నిర్మాణ పనులను ప్రారంభించారని సమాచారం. ఇది రజనీకి 169వ చిత్రం. అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని