Rajinikanth: ఓటీటీలోనూ దూసుకెళ్తోన్న పెద్దన్న!

ప్రముఖ నటుడు రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శివ రూపొందించిన చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో దీపావళి కానుకగా.. నవంబర్‌ 4న విడుదలైన విషయం తెలిసిందే. అన్నాచెల్లెలి బంధం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో రజినీ చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటించారు. కరోనా సమయంలోనూ విడుదలైన కొన్ని రోజుల్లోనే

Published : 30 Nov 2021 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు శివ రూపొందించిన చిత్రం ‘అన్నాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో దీపావళి కానుకగా.. నవంబర్‌ 4న విడుదలైన విషయం తెలిసిందే. అన్నాచెల్లెలి బంధం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో రజినీ చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటించారు. కరోనా సమయంలోనూ ఈ చిత్రం బ్లాక్‌బ్లాస్టర్‌ హిట్‌గా నిలిచింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం రూ.250కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఇటీవల ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదల కాగా.. అక్కడ కూడా ట్రెండింగ్‌లో ఉంది. రోజువారీ టాప్‌ 10 చిత్రాల జాబితాలో తమిళ వెర్షన్‌ ‘అన్నత్తే’ చిత్రం మొదటి స్థానంలో ఉండగా.. హిందీ వెర్షన్‌ సినిమా రెండో స్థానంలో నిలిచింది. ఇక తెలుగు వెర్షన్‌ ‘పెద్దన్న’ టాప్‌ 10 జాబితాలో 9వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో రజినీకాంత్‌ హవా థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ కనిపిస్తోందని సినీవర్గాలు అంటున్నాయి. 

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని