Madhavan: మాధవన్‌, నంబి నారాయణన్‌కు రజనీకాంత్‌ సత్కారం.. వీడియోకు నెటిజన్లు ఫిదా

‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన హీరో మాధవన్‌ నటనకు ప్రముఖ నటుడు రజనీకాంత్‌ ఫిదా అయ్యారు.

Published : 31 Jul 2022 10:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ (Rocketry) చిత్రానికి ప్రముఖ నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) ఫిదా అయ్యారు. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త, పద్మభూషణ్‌ నంబి నారాయణన్‌ (Nambi Narayanan) జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చినందుకు మాధవన్‌ను ప్రశంసించారు (R Madhavan). అనంతరం ఆయన్ను, నంబి నారాయణన్‌ను రజనీకాంత్‌ శాలువాతో సత్కరించారు. తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాధవన్‌ సంబంధిత వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘నంబి నారాయణన్‌ సమక్షంలో వన్‌మ్యాన్‌ ఇండస్ట్రీ, లెజెండ్‌ (రజనీకాంత్‌) నుంచి ఆశీర్వాదం తీసుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను’ అని మాధవన్‌ పేర్కొన్నారు. ఇద్దరు హీరోలు, శాస్త్రవేత్తను ఒకే  ఫ్రేమ్‌లో చూసిన నెటిజన్లు.. కామెంట్ల రూపంలో మాధవన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినిమా గురించి తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

మాధవన్‌ దర్శకుడిగా మారి, తెరకెక్కించిన తొలి చిత్రమిది. నంబి నారాయణన్‌.. గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కోవడం, నిరపరాధిగా బయటపడటం తదితర సంఘటలనతో ఈ చిత్రాన్ని రూపొందించారు. మాధవన్‌ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌ అవుతోంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని