Rajinikanth: ‘వీర సింహారెడ్డి’ దర్శకుడికి రజనీకాంత్ ఫోన్ కాల్.. ఎందుకంటే?
‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) దర్శకుడు గోపీచంద్ మలినేని(Gopichand Malineni)కి ఫోన్ చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth). ఈ సినిమా తనకెంతో నచ్చిందని మెచ్చుకున్నారు.
హైదరాబాద్: రాయలసీమ నేపథ్యంలో యాక్షన్, ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy). నందమూరి బాలకృష్ణ (Balakrishna) - గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబోలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ విశేష స్పందన అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన అగ్ర కథానాయకుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth).. చిత్ర బృందానికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. సినిమా మేకింగ్ తనకెంతో నచ్చిందన్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని స్వయంగా వెల్లడించారు.
‘‘ఇది నాకొక అద్భుతమైన క్షణం. తలైవా, సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. వీర సింహారెడ్డి చిత్రాన్ని చూశానని, సినిమా తనకెంతో నచ్చిందని ఆయన నాతో చెప్పారు. మా చిత్రం గురించి ఆయన అన్న మాటలు.. ఆయనకు కలిగిన భావోద్వేగం.. ఇంతకంటే నాకు ఈ ప్రపంచంలో విలువైనది ఇంకేదీ లేదనిపిస్తోంది. థ్యాంక్యూ రజని సర్’’ అని గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ట్వీట్ చేసి.. తన ఆనందాన్ని పంచుకున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ‘వీర సింహారెడ్డి’(Veera Simha Reddy) నిర్మితమైంది. ఇందులో బాలయ్య.. తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం పోషించారు. ఆయన సరసన శ్రుతిహాసన్ (Shruti Haasan), హనీరోజ్ నటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!
-
Asian Games: అన్న అక్కడ.. తమ్ముడు ఇక్కడ
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్