Rajinikanth: రోమాలు నిక్కబొడుచుకొనేలా చేసింది ‘కాంతార’

‘కాంతార’...సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ దిగ్గజాల వరకూ అందరి నోట వినబడుతున్న మాట. అంతలా ఈ కన్నడ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. రిషబ్‌ శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

Updated : 27 Oct 2022 08:53 IST

‘కాంతార’ (Kantara)...సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ దిగ్గజాల వరకూ అందరి నోట వినబడుతున్న మాట. అంతలా ఈ కన్నడ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. రిషబ్‌ శెట్టి (Rishab Shetty) నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. తాజాగా ఈ సినిమాని చూసిన రజనీకాంత్‌ (Rajinikanth) ప్రశంసలు కురిపించారు. ‘‘తెలిసింది తక్కువ..తెలియనిది ఎక్కువ...ఈ విషయాన్ని సినిమాల్లో మీకంటే బాగా ఎవరూ చెప్పలేరు’అని ‘కాంతార’ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ను ఆయన కొనియాడారు. ‘‘కాంతార సినిమా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఇండియన్‌ సినిమాలోనే ఇదొక మాస్టర్‌ పీస్‌. రచయిత, దర్శకుడు, నటుడు రిషబ్‌శెట్టి ప్రతిభకు హ్యాట్సాఫ్‌’’అని ట్వీట్‌ చేశారు రజనీకాంత్‌. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం పలు భారతీయ భాషల్లోకి అనువాదమై అన్నిచోట్లా భారీ వసూళ్లు అందుకుంటోంది.  ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.200కోట్లు కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని