Rajinikanth: వాళ్లతో సమానమని మాధవన్‌ నిరూపించుకున్నాడు: రజనీకాంత్‌

నంబి నారాయణన్‌ (Nambi Narayanan) జీవితాన్ని రియలెస్టిక్‌గా తెరకెక్కించి తొలి సినిమాతోనే తానూ గొప్ప దర్శకులతో సమానమని మాధవన్‌(Madhavan) నిరూపించుకున్నారని అగ్రకథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) అన్నారు....

Updated : 04 Jul 2022 16:12 IST

రాకెట్రీ టీమ్‌పై సూపర్‌స్టార్‌ ప్రశంసలు

హైదరాబాద్‌: నంబి నారాయణన్‌ (Nambi Narayanan) జీవితాన్ని మరింత వాస్తవంగా తెరకెక్కించి తొలి సినిమాతోనే తానూ గొప్ప దర్శకులతో సమానమని మాధవన్‌(Madhavan) నిరూపించుకున్నారని అగ్రకథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) అన్నారు. నంబి నారాయణన్‌ బయోపిక్‌గా సిద్ధమైన ‘రాకెట్రీ’ (Rocketry) వీక్షించిన రజనీ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ప్రతి ఒక్క భారతీయుడు, ముఖ్యంగా యువత తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘రాకెట్రీ’. మన దేశ అంతరిక్ష పరిశోధన అభివృద్ధి కోసం పద్మభూషణ్‌ నంబినారాయణన్‌ ఎంత కష్టపడ్డారు? ఎన్ని త్యాగాలు చేశారు? అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఈ సినిమాతో తొలిప్రయత్నంలోనే తానూ పేరు పొందిన దర్శకులతో సమానమని మాధవన్‌ నిరూపించుకున్నారు. ఇలాంటి అద్భుతమైన కథను రియలిస్టిక్‌గా చెప్పిన మాధవన్‌కు నా అభినందనలు’’ అని రజనీ పేర్కొన్నారు.

ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘రాకెట్రీ’ సిద్ధమైంది. మాధవన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలోనూ నటించి మెప్పించారు. అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్‌ట‌న్ విశ్వవిద్యాల‌యంలో నారాయ‌ణ‌న్ చ‌దువుకున్న రోజులు మొద‌లుకొని.. రాకెట్ సైన్స్ కోసం ఆయ‌న చేసిన కృషి.. గూఢ‌చ‌ర్యం కేసులో అరెస్టు కావడం.. నిరపరాధిగా బయటపడటం ఇలా ఎన్నో విషయాలను ఈ సినిమాలో చూపించారు. జులై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని