
Rajinikanth: 100 మందికి శిక్షణ ఇవ్వనున్న రజనీకాంత్ ఫౌండేషన్
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు రజనీకాంత్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే 71వ వసంతంలోకి అడుగుపెట్టిన రజనీ.. ఉద్యోగార్థులకు తోడ్పాటు అందించేందుకు ‘రజనీకాంత్ ఫౌండేషన్’ ద్వారా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘‘పేద విద్యార్థులను ఆదుకునేందుకు రజనీకాంత్ ఫౌండేషన్ ప్రత్యేక ప్రణాళికలు చేపడుతోంది. ఇందులో భాగంగా తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) నిర్వహించే పోటీ పరీక్షలకు సంబంధించి 100 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నాం. ‘సూపర్ 100బ్యాచ్’ పేరుతో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాం. సామాజిక అసమానతలను రూపుమాపడానికి రజనీకాంత్ ఫౌండేషన్ విశేషంగా కృషి చేస్తోంది. ఫౌండేషన్ సేవలు ప్రపంచవ్యాప్తంగా అందించాలని ఉన్నప్పటికీ, ప్రస్తుతం తమిళనాడుకు మాత్రమే మా సేవలు పరిమితం చేస్తున్నాం. తమిళనాడు ప్రజల కారణంగానే రజనీకాంత్‌కు పేరు ప్రతిష్ఠలు లభించాయి. అందుకే ఫౌండేషన్ అందించే ఏ సహాయం అయినా తమిళనాడు నుంచే ప్రారంభమవుతుంది. టీఎన్పీఎస్సీ ఉచిత గ్రూప్ పరీక్షలకు ట్రైనింగ్ అయ్యే ‘సూపర్ 100 బ్యాచ్’ రిజిస్ట్రేషన్ కోసం https://www.rajinikanthfoundation.org/tnpsc.html ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు’’ అని ఫౌండేషన్ ప్రతినిధులు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.