Rajinikanth: వెంకయ్యను మరికొన్నాళ్లు కేంద్ర మంత్రిగా కొనసాగించాల్సింది : రజనీకాంత్‌

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఉద్దేశిస్తూ తన మనసులోని మాటలు బయటపెట్టారు నటుడు రజనీకాంత్‌(Rajinikanth). ఆయన ఎలాంటి మచ్చ లేని రాజకీయ ప్రముఖుడని తెలిపారు.

Published : 12 Mar 2023 14:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాజీ ఉపరాష్ట్రపతి, తన స్నేహితుడు వెంకయ్యనాయుడు(Venkaiah Naidu)ను ఉద్దేశిస్తూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2017లో వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని అన్నారు. శనివారం రాత్రి చెన్నైలోని మ్యూజిక్‌ అకాడమీలో జరిగిన సేఫియన్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ రజతోత్సవాల్లో వెంకయ్యనాయుడితో కలిసి పాల్గొన్న ఆయన ఈ మేరకు తన మనసులోని మాటలు బయటపెట్టారు.

‘‘వెంకయ్యనాయుడితో నాకు ఎంతోకాలం నుంచి ఆత్మీయ అనుబంధం ఉంది. ఆయన గొప్ప రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం వ్యక్తిగతంగా నాకు నచ్చలేదు. రాజకీయాలపై ఎంతో పట్టు ఉన్న ఆయనను మరికొంతకాలంపాటు కేంద్రమంత్రిగా కొనసాగించాల్సింది. ప్రస్తుతం ఆయన ఆ పదవిలో లేరు కాబట్టే నా మనసులోని మాటలను బయటపెడుతున్నాను’’ అని రజనీకాంత్‌ వెల్లడించారు. తనకు మూత్రపిండాల సమస్య ఉండటం వల్లే రాజకీయాలకు దూరమయ్యానని రజనీకాంత్‌ తెలిపారు.

మరోవైపు, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు(Venkaiah Naidu).. రాజకీయాల్లోకి రావొద్దని రజనీకాంత్‌కు తాను సూచించినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తనను రజనీ అపార్థం చేసుకున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని