Rajinikanth: అనుమతి లేకుండా అలా చేస్తే చర్యలు తప్పవు :రజనీకాంత్‌

రజనీకాంత్‌‌(Rajinikanth) తన ఫొటోలను అనుమతిలేకుండా వినియోగించకూడదంటూ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. 

Published : 29 Jan 2023 14:51 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు రజనీకాంత్‌(Rajinikanth) తన ఫొటోలను, మాటలను అనుమతిలేకుండా వినియోగించకూడదంటూ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది పబ్లిక్‌ నోటీస్‌ విడుదల చేశారు. ‘‘రజనీకాంత్‌ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. వ్యాపారపరంగా రజనీకాంత్ పేరు, ఆయన ఫొటోలు ఉపయోగించుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉంటుంది. కొందరు వ్యక్తులు ఆయన మాటలను, ఫొటోలను, వ్యంగ్య చిత్రాలను నటనకు సంబంధించిన చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా ఆయన అనుమతి లేకుండా ప్రజాదరణ పొందుతూ.. వారి ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేస్తున్నారు. చిత్రపరిశ్రమలో ఆయన ఓ సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఆయనకు ఎంతో గౌరవం ఉంది. ఆయన ప్రతిష్ఠకు లేదా వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తే దాని వల్ల ఆయనకు ఎంతో నష్టం కలుగుతుంది. అందుకే నోటీసులు జారీ చేస్తున్నాం. ఇకపై రజనీకాంత్‌ అనుమతి లేకుండా ఆయనకు సంబంధించినవి ఏవీ వాడకూడదు’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. 

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రజనీకాంత్‌ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌(Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘‘జైలర్‌’’(Jailer) సినిమాలో నటిస్తున్నారు. రజనీ 169వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్(Mohanlal), కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌(Shivarajkumar) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని