Rajanikanth: రాజకీయాల్లోకి రావట్లేదు..

అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజాగా రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో భేటీ అయ్యారు. తన పొలిటికల్‌ ఎంట్రీ గురించి మక్కళ్‌ మండ్రం నిర్వాహకులకు ఉన్న సందేహాలపై ఆయన చర్చించారు....

Updated : 12 Jul 2021 11:27 IST

చెన్నై: తాను రాజకీయాల్లోకి రావట్లేదని అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి స్పష్టం చేశారు. తాజాగా రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో భేటీ అయ్యారు. సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.

‘సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల నేను అమెరికా వెళ్లొచ్చాను. సినిమా షూటింగులు, ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల రీత్యా గత కొంతకాలం నుంచి మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సరిగ్గా సంప్రదింపులు జరపలేకపోయాను. ఈ క్రమంలోనే నేడు నిర్వాహకులందరితో సమావేశమయ్యాను. వాళ్లందరికీ నా రాజకీయ అరంగేట్రంపై ఎన్నో సందేహాలున్నాయి. భవిష్యత్తులో నేను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అని వాళ్లు నన్ను అడుగుతున్నారు. అయితే నేను రాజకీయాల్లోకి రావట్లేదు. మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తున్నాను. దాని స్థానంలో రజనీ అభిమాన సంక్షేమ మండ్రం ఏర్పాటు చేస్తున్నాను’ అని రజనీ ప్రకటించారు.

రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడతారంటూ ఎంతో కాలంగా కొనసాగిన చర్చలకు గతేడాది డిసెంబర్‌లో ఆయన చెక్‌పెట్టిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల వల్ల తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన విరమించుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని