Rajinikanth: మద్యానికి బానిసైన నన్ను ఆమె ఎంతో మార్చింది..: రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) తన భార్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె తనని ఎంతో మార్చిందన్నారు.
హైదరాబాద్: తన స్టైల్‌తో ట్రెండ్ సెట్ చేసిన హీరో రజనీకాంత్(Rajinikanth). నటనలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఆయనను చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందుతుంటారు. అయితే.. రజనీ మాత్రం తన భార్య తనను ఎంతో మార్చిందని.. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో తన భార్య లత(Latha) గురించి ఎన్నో వేదికలపై చెప్పిన రజనీ.. తాజాగా మరోసారి ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన వేదికపై మాట్లాడుతూ తన భార్య వల్లే క్రమశిక్షణ నేర్చుకున్నానని అన్నారు.
‘‘నా భార్య లతను నాకు పరిచయం చేసిన మహేంద్రన్‌కు నేను రుణపడి ఉంటాను. బస్సు కండక్టర్‌గా చేస్తున్నప్పుడు రోజూ మద్యం తాగేవాడిని. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగేవాడినో లెక్క ఉండేది కాదు. అలాగే రోజూ మాంసాహారం తీసుకునేవాడిని. కానీ, ఈ మూడు మంచి అలవాట్లు కాదు. వీటికి బానిసలైన వాళ్లు కొంతకాలం తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరన్నది నా అభిప్రాయం. నా భార్య లత తన ప్రేమతో నన్ను ఎంతో మార్చింది. ఆమె వల్లే ఇప్పుడు నేను క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నాను’’ అని అన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘‘జైలర్’’(Jailer) సినిమాలో నటిస్తున్నారు. రజనీ 169వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal), కన్నడ హీరో శివరాజ్‌కుమార్(Shivarajkumar) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: డేటా చోరీ కేసులో ప్రముఖ సంస్థలకు నోటీసులు
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వర్కౌట్ గ్లో’.. ఊటీలో నోరా సందడి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Andhra News: సత్తెనపల్లి టికెట్ కోసం యుద్ధానికైనా సిద్ధం: వైకాపా నేత చిట్టా
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Movies News
Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు