Rajini Kamal: పిక్చర్ పర్‌ఫెక్ట్‌.. ఇద్దరు లెజెండ్స్‌ ఒకే ఫ్రేమ్‌లో..!

సినీపరిశ్రమలో దిగ్గజ నటులుగా పేరు తెచ్చుకున్నారు రజనీకాంత్‌.. కమల్‌హాసన్‌. కెరీర్‌లో రాణిస్తున్న రోజుల్లో వీరిద్దరూ పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు....

Published : 29 May 2022 14:34 IST

చెన్నై: సినీపరిశ్రమలో దిగ్గజ నటులుగా పేరు తెచ్చుకున్నారు రజనీకాంత్‌.. కమల్‌హాసన్‌. కెరీర్‌లో రాణిస్తోన్న రోజుల్లో వీరిద్దరూ పలు సినిమాల కోసం కలిసి పనిచేశారు. గత కొంతకాలంగా సినిమా, రాజకీయాలతో బిజీ కావడంతో వీరిద్దరూ ఎక్కువగా కలిసింది లేదు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిస్తే చూడాలని ఆశ పడుతున్న అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది. ‘విక్రమ్‌’ సినిమా ఈ స్టార్‌ హీరోలను కలిపింది. ‘ఉత్తమ విలన్‌’ తర్వాత నాలుగేళ్ల విరామం అనంతరం విశ్వనటుడు కమల్‌హాసన్‌ నటించిన చిత్రం ‘విక్రమ్‌’. లోకేశ్‌ కనకరాజు దర్శకుడు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమాలో కమల్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుస ప్రమోషన్స్‌తో ప్రేక్షకులకు ఎంతో చేరువవుతోంది. ఇదిలా ఉండగా, ‘విక్రమ్‌’ చిత్రబృందానికి రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. కమల్‌, లోకేశ్‌ కనకరాజుని ఇంటికి ఆహ్వానించిన రజనీ.. వారితో ముచ్చటించారు. తన మిత్రుడు కమల్‌తో ఎన్నో విషయాలపై సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని