
Updated : 21 Jan 2022 07:22 IST
Rajkumar Rao: ఫ్యామిలీ మేన్ దర్శకులతో రాజ్‌కుమార్
‘ది ఫ్యామిలీ మేన్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే మరో కొత్త ప్రాజెక్టును ఓకే చేశారు. బాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్‌కుమార్ రావ్ కథానాయకుడిగా ఈ కొత్త ప్రాజెక్టు ఉండనుంది. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ‘‘రాజ్, డీకే ద్వయంతో ఓ కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టనున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరిన్ని వివరాలు త్వరలో’’అని రాశారు రాజ్‌కుమార్. నెట్‌ఫ్లిక్స్ దీన్ని నిర్మించనుంది. ఇందులో దిల్జిత్ దోసాంజ్ నటించనున్నాడు. గతంలో రాజ్, డీకే దర్శకత్వంలో రాజ్‌కుమార్ హీరోగా ‘స్త్రీ’ తెరకెక్కి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రాజెక్టు సరికొత్త కథాంశంతో సాగే వెబ్ సిరీస్ అని తెలుస్తోంది.
Tags :