Rajkundra: రాజ్‌కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

అశ్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణలతో పోలీసుల అదుపులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఆయన కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.....

Updated : 25 Jul 2021 16:50 IST

సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చిన ఉద్యోగులు!

ముంబయి: అశ్లీల చిత్రాల చిత్రీకరణ ఆరోపణలతో పోలీసుల అదుపులో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కంపెనీలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఈ కేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు వారు సీబీఐని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో వ్యాపార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ వివరాల్ని వెల్లడించేందుకు రాజ్‌కుంద్రా సహకరించడం లేదని క్రైం బ్రాంచ్‌ పోలీసులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చిన నలుగురు ఉద్యోగులు ఈ కేసులో కీలకంగా మారనున్నారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. మేజిస్ట్రేట్‌ సమక్షంలో త్వరలో వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ముంబయిలోని రాజ్‌కుంద్రాకు చెందిన వియాన్‌ ఇండస్ట్రీస్‌ కార్యాలయంలో శనివారం పోలీసులు సోదాలు నిర్వహించారు. వీరికి ఓ లాకర్‌ లభ్యమైనట్లు తెలుస్తోంది. అందులో పలు వ్యాపార ఒప్పందాలు, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పత్రాలు లభ్యమైనట్లు సమాచారం. క్రైం బ్రాంచ్‌ వీటిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాకర్‌ని రహస్యంగా ఉంచారని.. అందుకే గతంలో నిర్వహించిన సోదాల్లో ఇది బయటపడలేదని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని