Published : 10 Jul 2021 01:09 IST

RajTarun: కూర్చుంది చాలు.. టీజర్‌ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. ‘కూర్చుంది చాలు!!’ అనేది ఉప శీర్షిక. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. నంద కుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ కథానాయిక. ప్రముఖ కథానాయకుడు రానా ఈ చిత్ర టీజర్‌ని శుక్రవారం విడుదల చేశారు. ఇందులో స్టాండప్‌ కమెడియన్‌గా కనిపించి వినోదం పంచారు రాజ్‌ తరుణ్‌. స్టాండప్‌ కామెడీకి ఒరిజినాలిటీ అవసరమని తెలుసుకుని బాత్‌రూమ్‌లో ఆయన చేసిన ప్రయత్నం, మరికొన్ని సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇలా కామెడీ ట్రాక్‌ సాగుతూనే మధ్యలో సీనియర్‌ నటి ఇంద్రజ, మురళీ శర్మ సడెన్‌ ఎంట్రీ ఆసక్తిని పెంచింది.

‘‘మగాళ్ల గురించి ప్రియాంక చోప్రా అన్న మాటలకి ఈలలు వేశారు.. అదే చలపతిరావు అంటే గోల చేశారు. చివరగా నేను చెప్పేదేంటంటే ‘ఒక అబ్బాయి సింగిల్‌గా ఉంటే పులి అవుతాడు. అదే అమ్మాయితో ఉంటే పులిహోర అవుతాడు’’ అని రాజ్‌ తరుణ్‌ ఇచ్చిన స్పీచ్‌ మెప్పిస్తుంది. వెన్నెల కిశోర్‌ తనదైన మార్క్‌ని చూపించారు. మరి స్టాండప్‌ రాహుల్‌ కథేంటి? ఇంద్రజ, మురళీ శర్మ పాత్రలేంటి? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం టీజర్‌ చూసి నవ్వుకోండి..


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని