Aamir Khan: ఆమిర్‌ఖాన్ మూడో వివాహం.. వైరల్‌గా మారిన రాఖీ కామెంట్స్
బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ (Aamir Khan) గురించి వైరల్ కామెంట్స్ చేశారు నటి రాఖీ సావంత్ (Rakhi Sawanth). ఆయన పెళ్లి గురించి ఆమె వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్‌డెస్క్: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్ (Aamir Khan) త్వరలో మూడో పెళ్లి చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి బీటౌన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నటి ఫాతిమా సనా షేక్‌ను ఆయన వివాహం చేసుకోనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలకు నటి రాఖీ సావంత్ మరింత ఆజ్యం పోశారు. దుబాయ్ వేదికగా జరిగిన ఐఫా 2023 (IIFA 2013) కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆమిర్‌ఖాన్ పెళ్లి గురించి జోక్స్ వేశారు.
‘‘మీ దృష్టిలో బీటౌన్‌లో హాటెస్ట్‌గా కనిపించే ముగ్గురు నటీనటులు ఎవరు?’’ అంటూ రెడ్‌కార్పెట్‌పై ఓ విలేకరి రాఖీ సావంత్‌ను ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఆమె.. ‘‘షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్.. మూడో వ్యక్తి ఎవరంటే.. మూడో పెళ్లి చేసుకోనున్న ఆమిర్‌ఖాన్ అయి ఉండొచ్చు. నాక్కూడా తెలియదు’’ అంటూ ఆమె నవ్వులు పూయించారు. అనంతరం ఆమె తన స్టేట్‌మెంట్‌ను ఉద్దేశిస్తూ..‘‘సారీ ఆమిర్.. ఐ లవ్ యూ’’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్‌గా మారడంతో.. ఆమిర్-ఫాతిమా నిజంగానే పెళ్లి చేసుకోనున్నారా? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
2016లో విడుదలైన ‘దంగల్’ సినిమాలో ఆమిర్‌ఖాన్ కుమార్తెగా ఫాతిమా నటించారు. ఆ సినిమా షూట్ సమయంలోనే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. గతంలో ఆమిర్ నివాసంలో జరిగిన పలు వేడుకల్లోనూ ఆమె పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఆమిర్ తన రెండో భార్య కిరణ్‌రావు నుంచి 2021లో విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని ఆనాడు ఈ జంట ప్రకటించింది. కిరణ్ రావు నుంచి విడిపోయిన నాటి నుంచి ఆయన ఫాతిమాతో ఫ్రెండ్లీగా ఉంటున్నారని, తరచూ కలుస్తున్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు వయసు రీత్యా చూస్తే ఆమిర్ కంటే ఫాతిమా 26 ఏళ్లు చిన్నది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
వివేక్ రామస్వామితో డిన్నర్ అవకాశం
-
చంద్రునిపై ల్యాండర్, రోవర్ నుంచి అందని సంకేతాలు
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!