Tollywood: అగ్ర హీరోతో ‘రాక్షసుడు2’

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన చిత్రం ‘రాక్షసుడు’. బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రమేశ్‌ వర్మ తెరకెక్కించారు.

Updated : 07 Dec 2022 19:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన చిత్రం ‘రాక్షసుడు’. బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రమేశ్‌ వర్మ తెరకెక్కించారు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే ఈ చిత్రానికి సీక్వెల్‌ని సిద్ధం చేసినట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు దర్శకనిర్మాతలు. ‘రాక్షసుడు 2’ టైటిల్‌తో కూడిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘రాక్షసుడు 2’ వస్తుంది. ఈసారి మరింత థ్రిల్‌ కలుగుతుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుంది’’ అని తెలిపారు రమేశ్‌ వర్మ. అయితే సాంకేతిక బృందంలో ఏ మార్పు లేకపోయినా తారాగణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఓ అగ్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ పాత్ర పోషించనున్నారు. మరి ఆయన ఎవరో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. నాయికా వివరాలు ఇంకా ప్రకటించలేదు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా ‘ఖిలాడి’ చిత్రం తెరకెక్కిస్తున్నారు రమేశ్‌ వర్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని