Rakul Preet Singh: అజిత్‌కు జోడీగా?
బాలీవుడ్లో వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది నటి రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు అరడజనుకు పైగా చిత్రాలుండగా.. రెండు మినహా మిగిలినవన్నీ హిందీ సినిమాలే. అయితే ఇప్పుడీ భామ ఓ తమిళ చిత్రానికి సంతకం
బాలీవుడ్లో వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది నటి రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు అరడజనుకు పైగా చిత్రాలుండగా.. రెండు మినహా మిగిలినవన్నీ హిందీ సినిమాలే. అయితే ఇప్పుడీ భామ ఓ తమిళ చిత్రానికి సంతకం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అజిత్ కథానాయకుడిగా హెచ్.వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం అజిత్‌కు జోడీగా రకుల్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్ నచ్చడంతో ఈ చిత్రం చేసేందుకు ఆమె అంగీకారం తెలిపిందని ప్రచారం వినిపిస్తోంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి గిబ్రాన్ స్వరాలందిస్తుండగా.. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రకుల్ నటించిన ‘రన్ వే 34’ విడుదలకు సిద్ధంగా ఉంది. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్