RakulPreet Singh: జాకీతో ప్రేమ.. అలా జరగడం నాకిష్టం లేదు: రకుల్‌

దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ స్టార్‌హీరోయిన్‌గా రాణిస్తున్నారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇటీవల ‘రన్‌ వే 34’తో బీటౌన్‌ ప్రేక్షకుల్ని అలరించిన ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెరీర్‌ పరంగా తాను ఎంతో ఆనందంగా.....

Published : 23 May 2022 10:59 IST

ముంబయి: దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ స్టార్‌హీరోయిన్‌గా రాణిస్తున్నారు నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇటీవల ‘రన్‌ వే 34’తో బీటౌన్‌ ప్రేక్షకుల్ని అలరించిన ఆమె తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెరీర్‌ పరంగా తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. అనంతరం తన ప్రేమ గురించి స్పందిస్తూ.. ప్రియుడు జాకీ భగ్నానీ మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు.

‘‘జాకీ నేనూ మంచి స్నేహితులం. మా అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డాం. రిలేషన్‌షిప్‌ ఓకే చేసుకున్నప్పుడే.. మా బంధం గురించి వీలైనంత త్వరగా బయటి ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాం. ఎందుకంటే.. రిలేషన్‌ని బయటపెట్టకపోతే మా గురించి వచ్చే వార్తలు, అసత్య ప్రచారాలతో ప్రశాంతత ఉండదు. మా పర్సనల్‌ లైఫ్‌ గురించి కాదు.. మేము చేసే వర్క్‌ గురించి అందరూ మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అదేవిధంగా రిలేషన్‌షిప్‌లో ఉండటం కూడా ఒక సహజ విషయం. మన జీవితాల్లో తల్లిదండ్రులు, సోదరీసోదరులు, స్నేహితులు ఎలా ఉంటారో అలాగే మనకంటూ ఓ వ్యక్తి ఉంటారు. సెలబ్రిటీలు కావడం వల్ల అందరూ మా లైఫ్‌పైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అది మాకిష్టం లేదు. అందుకే మేము బహిరంగంగా చెప్పేశాం’’ అని రకుల్‌ తెలిపారు.

నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో తాను ప్రేమలో ఉన్నానంటూ గతేడాది రకుల్‌ తెలిపారు. గతేడాది రకుల్‌ పుట్టినరోజు నాడు ఆమెతో దిగిన ఓ ఫొటోని జాకీ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ఆమె వల్ల తన జీవితంలో ఎన్నో వెలుగులు వచ్చాయని అన్నారు. వీళ్లిద్దరూ తమ ప్రేమను ప్రకటించిన నాటి నుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని