Rakul Preet: ప్రియుడితో పెళ్లిపై స్పందించిన రకుల్ ప్రీత్‌సింగ్
సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు నటి రకుల్ ప్రీత్ సింగ్. సినిమాల్లో బిజీగా ఉన్నా.. ఇన్‌స్టా, ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె నెటిజన్లతో ముచ్చటించారు. తెలుగు సినిమాలు, తన పెళ్లి వార్తలపై స్పందించారు.
ముంబయి: ‘ధృవ’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి తెలుగు చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న దిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు పొందిన ఈ నటి ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రకుల్ కొంతకాలంగా టాలీవుడ్ చిత్రాలకు దూరమయ్యారు. ‘కొండ పొలం’ తర్వాత ఆమె తెలుగు స్క్రీన్‌పై కనిపించలేదు. దీంతో ఆమె తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదా?అని అభిమానులు చర్చించుకొంటున్నారు. ఇదే విషయంపై తాజాగా రకుల్ స్పందించారు.
‘‘చాలా మంది నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో నేను తెలుగు సినిమాల్లో నటించలేదని నాక్కూడా తెలుసు. కానీ, త్వరలోనే తప్పకుండా టాలీవుడ్లో నటిస్తా. తెలుగు అభిమానులను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే తెలుగు చిత్ర పరిశ్రమే కారణం’’ అని రకుల్ వివరించారు.
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) తో రకుల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ అతి త్వరలో పెళ్లి చేసుకోనున్నారంటూ రకుల్ తమ్ముడు అమన్‌ప్రీత్ చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రికలో ఇటీవల వార్తలు వచ్చాయి. దానిపై రకుల్ స్పందిస్తూ.. ‘‘అమన్.. నా పెళ్లిపై నువ్వు నిజంగానే స్పష్టతనిచ్చావా? నా పెళ్లి గురించి నాక్కూడా చెప్పాలి కదా బ్రో..! నా జీవితం గురించి నాకే తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు. ఇక రకుల్ ప్రస్తుతం ‘డాక్టర్ జీ’, ‘థ్యాంక్ గాడ్’, ‘ఛత్రివాలి’, ‘ఇండియన్ - 2’ చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Priyanka Gandhi: గాంధీ కుటుంబాన్ని BJP నిత్యం అవమానిస్తోంది : ప్రియాంక
-
Sports News
Cricket: ఫుల్ స్పీడ్‌తో వికెట్లను తాకిన బంతి.. అయినా నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్
-
Movies News
Akanksha Dubey: సినీ పరిశ్రమలో విషాదం.. యువ నటి ఆత్మహత్య
-
Politics News
BRS: రైతుల తుపాన్ రాబోతోంది.. ఎవరూ ఆపలేరు: కేసీఆర్
-
Movies News
Orange: 13 ఏళ్లు అయినా.. ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గలే..!
-
General News
Rain Alert: తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు.. 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్