Rakul Preet Singh: ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి?: నెటిజన్‌కు రకుల్‌ప్రీత్‌ రిప్లై

తన పెళ్లి గురించి ఓ నెటిజన్‌ ప్రశ్నించగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తనదైన శైలిలో స్పందించారు.

Updated : 03 Jul 2024 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) చిత్రంతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh). కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా రూపొందిన ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులు/నెటిజన్లతో ముచ్చటించారు. వారిలో ఒకరు తన పెళ్లి గురించి ప్రశ్నించగా రకుల్‌ ఆశ్చర్యపోయారు. ‘మేడమ్‌.. వెడ్డింగ్‌ ఎప్పుడు ప్లాన్‌ చేశారు’ అని అడగ్గా ‘ఎన్ని సార్లు చేసుకోవాలి’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఏడడుగులు వేశారు. తమ పెళ్లి వేడుక ఫొటో షేర్‌ చేస్తూ సదరు నెటిజన్‌కు రకుల్‌ సమాధానమిచ్చారు. మరికొందరు అడిగిన ప్రశ్నలకు రకుల్‌ సమాధానాలివే.

* మీ అభిమాన క్రికెటర్‌?

రకుల్‌: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ అంటే నాకు ఇష్టం. 

* మీకు ఇష్టమైన ప్రదేశం?

రకుల్‌: గోవా. ఖాళీ సమయం దొరికితే అక్కడకు వెళ్లేందుకే ప్లాన్‌ చేస్తుంటా.

* మీరింత ఎనర్జిట్‌గా ఉండడానికి కారణం?

రకుల్‌: నేను నెగెటివిటీకి దూరంగా ఉంటా. నా గురించి నా వెనుక ఎవరేం అనుకున్నా పట్టించుకోను. నా దృష్టంతా పనిపైనే ఉంటుంది. అదే నేను ఇలా ఉండడానికి కారణమేమో. 

* వ్యాయామానికి ఎంత సమయం కేటాయిస్తారు?

రకుల్‌: రోజులో గంటకుపైగా వ్యాయామం చేస్తా. 

* హైదరాబాద్‌ ఎప్పుడొస్తారు?

రకుల్‌: ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్‌ కోసం త్వరలోనే వస్తా. ఆ వివరాలు సోషల్‌ మీడియా వేదికగా మీతో పంచుకుంటా.

2021లో వచ్చిన ‘కొండపొలం’ తర్వాత రకుల్‌ టాలీవుడ్‌లో నటించలేదు. బాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఎక్కువగా అవకాశాలొచ్చాయి. ‘బూ’, ‘అయలాన్‌’ తదితర డబ్బింగ్‌ చిత్రాలతో ఇటీవల తెలుగు ప్రేక్షకులకు అలరించారు. ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా దర్శకుడు శంకర్‌ రూపొందించిన ‘భారతీయుడు 2’లో సిద్ధార్థ్‌, ప్రియాభవానీ శంకర్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సినిమా జులై 12న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని