Rakul Preet Singh: సొంతింటికి వచ్చినట్టుగా ఉంది

బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ జంటగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న చిత్రం ‘దే దే ప్యార్‌ దే 2’. విజయవంతమైన ‘దే దే ప్యార్‌ దే’కి కొనసాగింపుగా అన్షుల్‌ శర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు.

Published : 17 Jun 2024 01:41 IST

బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌ జంటగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న చిత్రం ‘దే దే ప్యార్‌ దే 2’. విజయవంతమైన ‘దే దే ప్యార్‌ దే’కి కొనసాగింపుగా అన్షుల్‌ శర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించింది రకుల్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. మరోసారి అజయ్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందంటూ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘‘ప్రేక్షకులకు డబుల్‌ డోస్‌ ధమాకా అందించడానికి తిరిగొచ్చాం. మళ్లీ ఆయేషా పాత్రలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సహనటుడు అజయ్, చిత్రబృందంతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం రావడం గొప్ప విషయం. సెట్లోకి అడుగు పెట్టిన మొదటి రోజు సొంతింటికి వచ్చిన అనుభూతి కలిగింది. ఎందుకంటే దక్షిణాదిలో పనిచేసినప్పుడు ప్రేక్షకులు నన్ను ఎలా ఆదరించారో.. బాలీవుడ్‌లో మళ్లీ ఈ సినిమాతోనే అభిమానుల నుంచి అలాంటి ప్రేమను సొంతం చేసుకోగలిగాను. తొలిభాగం కన్నా మరింత భిన్నంగా రాబోయే సీక్వెల్‌ ఉంటుంద’’ని చెప్పుకొచ్చింది రకుల్‌. మరికొద్ది రోజుల్లో ‘భారతీయుడు 2’తో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది రకుల్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని