Rakul Preet Singh: ‘క్రైమ్‌ థ్రిల్లర్‌లో రొమాన్సా..?’

కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో సూపర్‌హిట్‌ సొంతం చేసుకున్న ‘రాచ్చసన్‌’, ‘రాక్షసుడు’ చిత్రాలకు రీమేక్‌గా సిద్ధమైన లేటస్ట్‌ బాలీవుడ్‌ ఎంటర్‌టైనర్‌ ‘కట్‌పత్లీ’....

Updated : 10 Sep 2022 13:35 IST

విమర్శలపై రకుల్‌ ఏమన్నారంటే..

ముంబయి: కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో సూపర్‌హిట్‌ సొంతం చేసుకున్న ‘రాచ్చసన్‌’, ‘రాక్షసుడు’ చిత్రాలకు రీమేక్‌గా సిద్ధమైన లేటస్ట్‌ బాలీవుడ్‌ ఎంటర్‌టైనర్‌ ‘కట్‌పత్లీ’ (Cuttputlli). అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆయన ప్రియురాలిగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (Rakul Preet Singh) మెప్పించారు. సెప్టెంబర్‌ 2 నుంచి ఈసినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని చూసిన తర్వాత పలువురు ఆడియన్స్‌ విమర్శనాస్త్రాలు విసురుతున్నారు. సీరియల్‌ కిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నటీనటుల మధ్య రొమాన్స్‌ చూపించడం ఎందుకు? ఇలాంటి సీరియస్‌ కథాంశంలో రొమాంటిక్‌ సీన్స్‌ అవసరం ఏముంది? అని పెదవి విరుస్తున్నారు.

వీటిపై తాజాగా రకుల్‌ స్పందించారు. ‘‘ఒక వర్గం ప్రేక్షకులు రొమాన్స్‌, సాంగ్స్‌, డ్యాన్సులు చూడటానికి ఇష్టపడతారు. కుటుంబం మొత్తం కలిసి చూసే చిత్రంగా మేము దీన్ని రూపొందించాం. భారతీయ చిత్రాల్లో అన్నిరకాల ఎమోషన్స్‌ ఉంటాయి. తెలుగు సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయంటే ఆ చిత్రాల్లో అన్నిరకాల భావోద్వేగాలు చక్కగా ఉండటం వల్లే. గడిచిన మూడేళ్లుగా అందరూ క్లిష్టతరమైన కాలాన్ని గడిపారు. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకుంటున్నారు. కాబట్టి సినిమా మొత్తం కేవలం థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందించకుండా మధ్య మధ్యలో ఇలాంటి సన్నివేశాలు తెరకెక్కిస్తే చూసేవారు కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు’’ అని రకుల్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని