Rakul Preet Singh: అభ్యంతరం చెప్పలేదు..

కథల ఎంపికలోనూ... చేసే పాత్రల విషయంలోనూ ఎంతో వైవిధ్యత కనబరుస్తోంది నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం ఆమె నుంచి రానున్న హిందీ సినిమాలు ‘డాక్టర్‌ జి’, ‘ఛత్రివాలి’ ఈ కోవకు చెందినవే. గైనకాలజిస్ట్‌గా ఓ పురుష వైద్యుడు చేసే పోరాట కథతో రూపొందిన సినిమా ‘డాక్టర్‌ జి’. ఇక ‘ఛత్రివాలి’.. కండోమ్‌ టెస్టర్‌ పని చేసే ఓ యువతి కథతో రూపొందుతున్న చిత్రం.

Updated : 13 Oct 2022 07:24 IST

కథల ఎంపికలోనూ... చేసే పాత్రల విషయంలోనూ ఎంతో వైవిధ్యత కనబరుస్తోంది నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం ఆమె నుంచి రానున్న హిందీ సినిమాలు ‘డాక్టర్‌ జి’, ‘ఛత్రివాలి’ ఈ కోవకు చెందినవే. గైనకాలజిస్ట్‌గా ఓ పురుష వైద్యుడు చేసే పోరాట కథతో రూపొందిన సినిమా ‘డాక్టర్‌ జి’. ఇక ‘ఛత్రివాలి’.. కండోమ్‌ టెస్టర్‌ పని చేసే ఓ యువతి కథతో రూపొందుతున్న చిత్రం. ఇందులో ఆ టెస్టర్‌ పాత్రను రకుల్‌ (Rakul) పోషించింది. ‘ఈ తరహా కథాంశాల్లో నటిస్తున్నానని చెప్పినప్పుడు ఇంట్లో వాళ్లు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేశారా?’ అని ప్రశ్నిస్తే.. తనదైన శైలిలో ఇలా బదులిచ్చింది రకుల్‌. ‘‘సామాజిక సమస్యలపై చర్చను లేవనెత్తే చిత్రాలివి. అందుకే వీటిని నా తల్లిదండ్రులు గొప్ప ఆలోచనలుగా భావించారు. నన్నెంతో ప్రోత్సహించారు. ‘డాక్టర్‌ జి’లో గైనకాలజిస్ట్‌ అయిన ఓ పురుష వైద్యుడి గురించి చర్చించాం. మన వద్ద ఇలాంటి వాటిపై నిషేధం ఉండటం దురదృష్టకరం. గుండె, మెదడు.. ఇలా శరీరంలోని ఇతర వ్యవస్థల కంటే పునరుత్పత్తి అవయవాన్నే ఎందుకు భిన్నంగా చూడాలి. చికిత్స చేయడం వైద్యుడు పని అని అందరికీ తెలుసు. ఆ వైద్యుడు మగవాడైతే ఏంటి? ఆడవారైతే ఏంటి? దానిపై మేము ‘డాక్టర్‌ జి’ ద్వారా చర్చిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని