Thank God: ఈ సినిమా చూసి రాత్రి 12 గంటలకు మా నాన్న ఫోన్‌ చేశారు..: రకుల్‌

టాలీవుడ్‌లోనే గాక బాలీవుడ్‌ లోనూ తన సత్తా నిరూపించుకుంటుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తాజాగా ఆమె నటించిన ‘థ్యాంక్‌ గాడ్’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా చూసిన రకుల్‌ తల్లిదండ్రులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. 

Published : 27 Oct 2022 12:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  బాలీవుడ్‌ అగ్ర హీరోలు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn), సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra) కలిసి నటించిన చిత్రం ‘థ్యాంక్‌ గాడ్‌’ (Thank God). ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) కథానాయిక. ఈ సినిమా చూసిన వారు ఆమె నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా రకుల్‌ తల్లిదండ్రులు కూడా ఈ సినిమాపై స్పందించారు. ఈ విషయాన్ని రకుల్‌ మాట్లాడుతూ..‘‘అమ్మానాన్న నా తాజా చిత్రం ‘థ్యాంక్‌ గాడ్’ చూశారు. మా నాన్న రాత్రి 12 గంటలకు ఫోన్‌ చేసి ‘ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాల్లో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. నేటి తరం వాళ్లందరూ ఈ చిత్రాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఇది మన భారతీయ కుటుంబాలకు, సంస్కృతికి చాలా దగ్గరగా ఉంది’ అని అన్నారు. నా దగ్గర నుంచి దర్శకుడి నంబర్‌ తీసుకొని ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు కృతజ్ఞతలు తెలిపారు’’ అని రకుల్‌ సంతోషం వ్యక్తం చేసింది.

ఇక ప్రేక్షకులతో పాటు థియేటర్లో ఈ సినిమా చూసిన రకుల్‌ వివరిస్తూ.. ‘‘నేను ఈ చిత్రాన్ని థియేటర్లో చూస్తున్నప్పుడు వాళ్ల స్పందనకు ఆశ్చర్యపోయాను. సినిమా అయ్యాక ఎంతోమంది భావోద్వేగానికి గురయ్యారు. ఈ చిత్రాన్ని అందరూ ఇష్టపడుతున్నారు. ప్రేక్షకుల హృదయాలకు ఇది ఎంతో చేరువైంది. ‘థ్యాంక్‌ గాడ్’ లాంటి చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలని ఉంది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని