Rakul Preet Singh: సోషల్‌ మీడియాలో మాట్లాడుతూ చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు: రకుల్‌

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) ప్రస్తుతం బాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాది, ఉత్తరాది చిత్రాలు రెండూ భారతీయ చిత్ర పరిశ్రమలో భాగమేనని పేర్కొంది.

Published : 27 Feb 2023 20:07 IST

హైదరాబాద్‌: హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) టాలీవుడ్‌లో మంచి సినిమాలతో అలరించి అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ వరస ఆఫర్లు అందుకుంటోంది. గతేడాది రకుల్‌ నటించిన ఐదు సినిమాలు బీటౌన్‌లో సందడి చేశాయి. తన కెరీర్‌ విషయంలో సంతోషంగా ఉన్న రకుల్‌  తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ నటిగా తాను ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటానని పేర్కొంది. 

ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించే అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. ఒక సినిమా విజయం ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది. కానీ అన్నిటికంటే ప్రేక్షకులు ముఖ్యమైన వారని రకుల్‌ (Rakul Preet Singh)తెలిపింది. ఇక దక్షిణాది సినిమాలు బాలీవుడ్‌ చిత్రాలకు మధ్యపోటీ విషయంలో ఇటీవల చాలా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై రకుల్‌ మాట్లాడింది. ‘‘దీని గురించి అందరూ సోషల్‌మీడియాలో మాట్లాడుతూ చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు.  హిందీ, ప్రాంతీయ సినిమాలు రెండూ భారతీయ చిత్ర పరిశ్రమలో భాగాలే కాబట్టి వాటిని ఒకదానితో ఒకటి పోల్చడం సరైన పద్ధతి కాదు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ అదరిస్తారు. పరిశ్రమలో ఎంతోమంది గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు ఉన్నారు. వాళ్లు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చిత్రాలు రూపొందించగలరు’’ అని చెప్పింది.

అలాగే ఓటీటీల గురించి మాట్లాడుతూ..‘‘కొవిడ్‌ సమయంలో ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. ఈ రోజుల్లో సినిమా ఏ ప్లాట్‌ఫామ్‌లో విడుదలవుతుందన్నది ముఖ్యం కాదు. సినిమా బాగుంటే థియేటర్లో, ఓటీటీల్లో చూస్తారు. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఎక్కవ ప్రశంసలు అందుకున్నాయి. సినిమా ఫలితాలు అందులోని ఎమోషన్‌ మీద ఆధారపడి ఉంటాయి’’ అని చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని