దానికోసం.. ఎంతైనా కష్టపడొచ్చు

‘మీ ఫలానా సినిమా చాలా బాగుంటుంది...మీరు చాలా బాగా నటించారు’అంటూ అభిమానులు ఆత్మీయంగా నవ్వుతూ పలకరించినప్పుడు ఉండే ఆనందానికి హద్దే ఉండదు...

Published : 15 May 2021 15:17 IST

‘‘మీ ఫలానా సినిమా చాలా బాగుంటుంది...మీరు చాలా బాగా నటించారు’అంటూ అభిమానులు ఆత్మీయంగా నవ్వుతూ పలకరించినప్పుడు ఉండే ఆనందానికి హద్దే ఉండదు. ఆ నవ్వు కోసం ఎంతైనా కష్టపడాలి అనిపిస్తుంది’’అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా కొనసాగుతూనే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రకుల్‌ అక్కడా సత్తా చాటుతోంది. ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టి ఏడేళ్లు అయ్యింది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది రకుల్‌. ‘‘నా స్టార్‌డమ్‌ ఏమైపోతుందో అనే భయం లేకుండా ముందుకెళ్లడమే నా విజయానికి ప్రధాన కారణం. ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టే నాటికి నాకు ఎలాంటి పేరు లేదు. అదృష్టవశాత్తు చాలా మందికి దొరకని గొప్ప అవకాశాలు దక్కాయి. వాటితో నా కలను నెరవేర్చుకున్నాను. ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమే కొత్త పాత్రల వైపు అడుగులేసేలా చేస్తుంది’’అని చెప్పింది రకుల్‌. ఆమె నటించిన ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అమితాబ్‌బచ్చన్, అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి ‘మేడే’, జాన్‌ అబ్రహం ‘ఎటాక్‌’, ఆయుష్మాన్‌ ఖురానా ‘డాక్టర్‌ జి’, అజయ్‌దేవ్‌గణ్‌తో ‘థ్యాంక్‌ గాడ్‌’ ఇలా భారీ బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తోంది రకుల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని