Rakul Preet Singh: నెట్టింటిని షేక్‌ చేస్తోన్న రకుల్‌ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (Rakul Preet Singh) తాజాగా తన డ్యాన్స్‌తో నెట్టింటిని షేక్‌ చేస్తున్నారు. దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోన్న ఆమె తాజా...

Published : 25 Jun 2022 01:28 IST

జాకీ భగ్నానీ ఏమన్నారంటే

ముంబయి: స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ (Rakul Preet Singh) తాజాగా తన డ్యాన్స్‌తో నెట్టింటిని షేక్‌ చేస్తున్నారు. దక్షిణాది, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోన్న ఆమె తాజాగా సెలబ్రిటీ కొరియోగ్రాఫర్‌ డింపుల్‌ దగ్గర డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో భాగంగా యూట్యూబ్‌లో 20 కోట్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకున్న సెన్సేషనల్‌ ‘పసూరి’ (Pasoori) సాంగ్‌కు రకుల్‌ కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోని ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ఈ పాట తన ఫేవరెట్‌ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది. గంటలోనే సుమారు 3 లక్షలకు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. దీన్ని చూసిన సెలబ్రిటీలు.. ‘‘ఓ మై గాడ్‌’’, ‘‘చంపేశావ్‌ బేబీ’’ అని కామెంట్స్ పెడుతున్నారు.

ఇక, రకుల్‌ ప్రియుడు, నటుడు జాకీ భగ్నానీ(Jackky Bhagnani) సైతం ఈ వైరల్‌ వీడియోపై స్పందించారు. ‘‘డియర్‌ లవ్‌.. నాక్కూడా నేర్పించవా’’ అని కామెంట్ పెట్టారు. ‘ఎటాక్‌’, ‘రన్‌వే 34’ చిత్రాలతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన రకుల్‌ ప్రస్తుతం ‘డాక్టర్‌ జీ’, ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘ఛత్రివాలీ’ ‘31 అక్టోబర్‌ లేడీస్‌ నైట్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘కొండపొలం’(Kondapolam) తర్వాత రకుల్‌ తెలుగులో ఏ ప్రాజెక్ట్‌కూ సంతకం చేయలేదు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని