Ram Charan: ఆ విషయంలో నన్నెవరూ అధిగమించలేరు: కుమార్తెపై రామ్‌ చరణ్‌ ప్రేమ

తన కుమార్తె క్లీంకారపై ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశారు రామ్‌ చరణ్‌. ఫాదర్స్‌ డే సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు.

Updated : 16 Jun 2024 14:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన గారాలపట్టి క్లీంకార (Klinkara)కు గోరుముద్దలు తినిపించడంలో తనను మించినవారులేరని నటుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) అన్నారు. ముద్దుల తనయకు అన్నం పెట్టేటప్పుడు తనలోకి సూపర్‌పవర్స్‌ ఆవహిస్తాయని వెల్లడించారు. ఫాదర్స్‌ డే సందర్భంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విశేషాలను పంచుకున్నారు. ‘‘క్లీంకారకు రోజుకు రెండు సార్లైనా నేను తినిపిస్తుంటా. అలా చేయడం నాకు చాలా ఇష్టం. నేను గోరుముద్దలు పెడితే.. గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. ఆ విషయంలో నన్నెవరూ బీట్‌ చేయలేరు’’ అని కుమార్తెపై ప్రేమను వ్యక్తం చేశారు. క్లీంకార ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులను గుర్తిస్తోందని తెలిపారు. షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు తనను ఎంతగానో మిస్‌ అవుతున్నట్టు చెప్పారు. తన బిడ్డ స్కూల్‌లో జాయిన్‌ అయ్యే వరకైనా ఆమెతో ఎక్కువగా సమయం వెచ్చించేలా తదుపరి చిత్రాల షెడ్యూల్స్‌ను ప్లాన్‌ చేసుకోబోతున్నట్టు తెలిపారు. క్లీంకారతో ఉంటే తన తండ్రి చిరంజీవి పిల్లాడిగా మారిపోతారన్నారు. ‘నన్ను తాత అని పిలవకు బోరింగ్‌గా ఉంటుంది. చిరుత అని పిలువు’ అంటూ మురిసిపోతారని చెప్పారు. తన తండ్రి గురించి చరణ్‌ పంచుకున్న సంగతులివీ..

నాన్న.. రోల్‌ మోడల్‌

‘‘డెడికేషన్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, క్రమశిక్షణలో నాన్నే నాకు స్ఫూర్తి. ‘రామ్‌.. నువ్వెంత సక్సెస్‌ అయ్యావనేదాన్ని నేను పట్టించుకోను. కానీ, క్రమశిక్షణను అలవరుచుకో’ అని ఆయన చెబుతుంటారు. నాన్న లివింగ్‌ రోల్‌ మోడల్‌. ఆయనలా బతకడం చాలా కష్టం (నవ్వుతూ). ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తారు. జిమ్‌లో మాతో పోటీపడతారు. ఆయన నాలుగు చిత్రాలకు సంతకాలు చేస్తే.. నేను ఒకటో రెండో చేస్తున్నా’’ అని సరదాగా అన్నారు.

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)తో బిజీగా ఉన్నారు. అది పూర్తికాకముందే ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా ఖరారు చేశారు. కొన్ని రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభమైందా చిత్రం. ‘విశ్వంభర’తో వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనున్నారు చిరంజీవి (Chiranjeevi).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని