RRR: క్యా సీన్‌ హై.. హీరోల పరిచయం.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ పడిందిలా!

సీతారామరాజు- కొమురం భీమ్‌ పాత్రల్లో నటులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Updated : 24 May 2022 16:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీతారామరాజు- కొమురం భీమ్‌ పాత్రల్లో నటులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్యారెక్టర్లలో వీరిద్దరు కలిసి నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) రికార్డు స్థాయి వసూళ్లు సాధించి, ప్రస్తుతం ఓటీటీల్లో (Zee 5, Netflix)  సందడి చేస్తోంది. రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ హవా కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’.. యూట్యూబ్‌ వేదికగా రెండు సన్నివేశాలను విడుదల చేసింది. వాటిల్లో ఇద్దరు హీరోల పరిచయం సన్నివేశం ఒకటికాగా, ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ముందు వచ్చే సీన్‌ మరొకటి.

సాంకేతికలోపంతో ఓ రైలుకు మంటలు వ్యాపించి, బోగీలు నదిలో పడతాయి. అదే సమయంలో ఆ నదిలో ఉన్న బాలుడు ఈ ప్రమాదంలో చిక్కుకుంటే రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి రక్షిస్తారు. సాహసోపేతమైన ఈ సీన్‌ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సుమారు 2 నిమిషాలున్న ఈ ఫ్రేమ్‌లో హీరోయిజం, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ.. ఇలా అన్నీ అద్భుతమనిపిస్తాయి. హీరోలిద్దరు ‘నేను రాజు, నేను అక్తర్‌’ అంటూ పరస్పరం పరిచయం చేసుకున్న వెంటనే RRR టైటిల్‌ పడటం ‘క్యా సీన్‌ హై’ అని అందరితోనూ అనిపించేలా ఉంది. మరో వీడియోలో.. ‘నీకు డ్యాన్స్‌ రాదు’ అంటూ ఓ పాత్ర ఎన్టీఆర్‌ను హేళన చేసే సీన్‌ చూడొచ్చు. ఇదే సీన్‌లో తారక్‌ను కాపాడేందుకు చరణ్‌ రావడం అదుర్స్‌ అనిపిస్తోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని