Ramcharan: మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో అద్భుత చిత్రమిది: రామ్‌చరణ్‌

తెలుగు చిత్రపరిశ్రమ నుంచి వచ్చిన మరో అద్భుతమైన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అని రామ్‌చరణ్‌ అన్నారు.

Published : 10 Jan 2022 02:00 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్రపరిశ్రమ నుంచి వచ్చిన మరో అద్భుతమైన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’ అని రామ్‌చరణ్‌ అన్నారు. వీకెండ్‌ సందర్భంగా షూట్స్‌ నుంచి కాస్త విరామం తీసుకున్న చరణ్‌ తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందంటూ ట్వీట్‌ చేశారు. ‘‘మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో మంచి కళాత్మక చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌.. మీరు తెరకెక్కించిన ఈ సినిమా అందమైన అనుభూతిని అందించింది. నాని, సాయిపల్లవి.. ఇప్పటివరకూ నటించిన చిత్రాలకంటే ఈ సినిమాలో మీ నటన ఎంతో బాగుంది. కృతిశెట్టి, మడోన్నాకు నా అభినందనలు. మిక్కీ జె.మేయర్‌ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది’’ అని చరణ్‌ ట్వీట్‌ చేశారు. కాగా, చరణ్‌ ట్వీట్‌పై నాని, సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేశారు. ‘‘బిజీ షెడ్యూల్‌లో సమయం తీసుకుని మా చిత్రాన్ని వీక్షించినందుకు ధన్యవాదాలు సర్‌. మీకు మా సినిమా నచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని సాయిపల్లవి రిప్లై ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని