Ram Charan: రామ్‌చరణ్‌ ఆటాపాటా

ఆస్కార్‌ పురస్కారంతో ఒక పక్క నాటు నాటు హీటు కొనసాగుతుంగానే... మరోవైపు కొత్త పాట కోసం రంగంలోకి దిగాడు రామ్‌చరణ్‌ (Ram Charan).

Updated : 20 Mar 2023 07:08 IST

ఆస్కార్‌ (Oscars 2023) పురస్కారంతో ఒక పక్క నాటు నాటు హీటు కొనసాగుతుంగానే... మరోవైపు కొత్త పాట కోసం రంగంలోకి దిగాడు రామ్‌చరణ్‌ (Ram Charan). కొత్త సినిమా సెట్లో... కొత్త స్టెప్పులు వేస్తూ ఊరిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అడ్వాణీ కథానాయిక. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీలపై ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో ఆదివారం నుంచే ఆ పాట చిత్రీకరణ మొదలైంది. రామ్‌చరణ్‌ని సెట్‌కి స్వాగతిస్తూ... ప్రభుదేవా 400 మంది డ్యాన్సర్లతో కలిసి నాటు నాటు పాటకి  స్టెప్పులేశారు. ఆ వీడియో వైరల్‌ అయ్యింది. ఈ సెట్లోనే రామ్‌చరణ్‌ని, ‘నాటు నాటు...’పాటకి నృత్యరీతులు సమకూర్చిన ప్రేమ్‌రక్షిత్‌ని ప్రభుదేవా సన్మానించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు