రామ్‌చరణ్‌ బర్త్‌డే.. ఆర్‌సీ 15 సెట్స్‌లో గ్రాండ్‌ సెలబ్రేషన్స్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత శంకర్‌ దర్శకత్వంలో చరణ్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా  ఈ సినిమా సెట్స్‌లో సెలబ్రేషన్స్‌ జరిగాయి. 

Published : 26 Mar 2023 12:03 IST

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) - ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయిక. దిల్‌రాజు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. రామ్‌చరణ్‌ పుట్టినరోజు (మార్చి 27) పురస్కరించుకుని శనివారం రాత్రి ఈ సినిమా సెట్స్‌లో గ్రాండ్‌ లెవల్‌లో సెలబ్రేషన్స్‌ జరిగాయి. శంకర్‌, దిల్‌రాజు, కియారా, ప్రభుదేవాతోపాటు పలువురు అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో రామ్‌చరణ్‌ కేక్‌ కట్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రనిర్మాణ సంస్థ షేర్ చేసింది. ఇక ఈ సినిమా చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో ప్రభుదేవా (Prabhudeva) మాస్టర్‌ కొరియోగ్రఫీలో రామ్‌చరణ్‌-కియారాపై ఓ పాటను షూట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని