Ram Charan: ముంబయి వేదికగా.. గొప్ప మనసు చాటుకున్న రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌

రామ్‌చరణ్‌ (Ram Charan) అభిమానులు తమ మంచి మనసు చాటుకున్నారు. ముంబయి వేదికగా సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.

Published : 15 May 2023 23:58 IST

ముంబయి: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) చేస్తోన్న సేవా కార్యక్రమాలను చూసి స్ఫూర్తి పొందిన ఆయన అభిమానులు తాజాగా తమ గొప్ప మనసు చాటుకున్నారు. ముంబయి వేదికగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు తమ వంతు సాయం అందించారు.

దేశంలోని చాలా నగరాల్లో గత కొన్ని రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబయికు చెందిన సుమారు 1000 మంది రామ్‌చరణ్‌ అభిమానులు సామాన్యులకు తమవంతు సాయం చేయాలని భావించారు. సోమవారం మధ్యాహ్నం జుహూ, భివాండి ప్రాంతాల్లోని శంకర్‌ ఆలయం పరిసరాల్లో మజ్జిగ పంపిణీ చేశారు. దాదాపు 10 వేల మందికి మజ్జిగ బాటిల్స్‌ను అందించారు. మరికొన్ని చోట్ల అన్నదానం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వేదికగా రామ్‌చరణ్‌ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. కరోనా సమయంలోనూ ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణీలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రతి ఒక్కరూ ఇతరులకు సాయం చేయాలని ఆయన పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు