టైమ్‌ స్వ్కేర్‌ బిల్‌బోర్డ్‌పై రామ్‌చరణ్‌ ఫోటోలు

మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ ‘చిరుత’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత తనదైన శైలిలో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ రాణిస్తున్నారు.

Published : 27 Mar 2021 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ ‘చిరుత’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత తనదైన శైలిలో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ రాణిస్తున్నారు. ఈరోజు రామ్ చరణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అరుదైన గౌరవాన్ని పొందారు. న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఉన్న నాస్డాక్ భారీ భవంతిపై ఆయన ఫోటోలు ప్రదర్శించారు. ఈ అరుదైన గౌరవాన్ని పొందిన మొట్టమొదటి దక్షిణాది నటుడు రామ్‌చరణ్‌. నాస్డాక్ బిల్‌బోర్డ్‌లలో చరణ్‌ పోస్టర్‌లను కలిగిన వీడియోని ఆయన సతీమణి కొణిదెల ఉపాసన తన ట్వీటర్‌లో షేర్‌ చేసింది. ‘‘ఇదొక స్టార్‌ స్ట్రక్.. తీపి గుర్తు..’’ అంటూ పేర్కొంది. ప్రస్తుతం రామ్ చరణ్‌ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ చిత్రబృందం ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. అందులో చిరు - రామ్‌ తుపాకులు పట్టుకొని కనిపించారు. ఈ స్టిల్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని