Ram Charan: ఎన్టీఆర్‌.. నీతో మళ్లీ డ్యాన్స్‌ చేయాలని ఉంది: రామ్‌చరణ్‌

‘ఆస్కార్‌’ (Oscars 2023) అవార్డుల ప్రదానోత్సవాన్ని ఉద్దేశిస్తూ రామ్‌చరణ్‌ (Ram Charan) ఓ ఎమోషనల్‌  పోస్ట్‌ పెట్టారు. తారక్‌(NTR)తో కలిసి మరోసారి డ్యాన్స్‌ చేయాలని ఉందని తెలిపారు.

Updated : 13 Mar 2023 12:34 IST

హైదరాబాద్‌: ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ఆస్కార్‌ (Oscars 2023) వరించడం పట్ల రామ్‌చరణ్‌ (Ram Charan) ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ మొత్తానికి ధన్యవాదాలు చెబుతూ ఆయన ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశారు. మరోసారి తారక్‌ (NTR)తో డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే, ఈ అవార్డు భారతీయ నటీనటులందరి సొంతమని అన్నారు.

‘‘మా జీవితాల్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర చరిత్రలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంతో ప్రత్యేకమైనది. ‘ఆస్కార్‌’ అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేనింకా కలలోనే ఉన్న భావన కలుగుతోంది. రాజమౌళి, కీరవాణి.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి మాస్టర్‌పీస్‌లో నన్ను భాగం చేసిన వారిద్దరికీ ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు’ అనేది ఒక భావోద్వేగం. ఆ ఎమోషన్‌కు రూపమిచ్చిన గేయరచయిత చంద్రబోస్‌, గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌కు ధన్యవాదాలు. నా బ్రదర్‌ ఎన్టీఆర్‌, కో-స్టార్‌ అలియాభట్‌కు ధన్యవాదాలు. తారక్‌.. నీతో మళ్లీ డ్యాన్స్‌ చేసి రికార్డ్స్‌ క్రియేట్‌ చేయాలని ఆశపడుతున్నా. భారతీయ నటీనటులందరికీ ఈ అవార్డు సొంతం. మాకు ఎంతగానో సపోర్ట్‌ అందించిన అభిమానులందరికీ నా కృతజ్ఞతలు’’ అని రామ్‌చరణ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు