Ram Charan: ప్రతిభతోనే ఇక్కడున్నా

‘ప్రతిభ లేకపోతే సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం సులభం కాదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రామ్‌చరణ్‌ (ram Charan). ఆస్కార్‌ వేడుకల నుంచి తిరిగి వచ్చిన అనంతరం దిల్లీలో చర్చావేదికలో పాల్గొని నెపోటిజం, రాజకీయాలు తదితర అంశాల గురించి మాట్లాడారు.

Updated : 19 Mar 2023 07:01 IST

‘ప్రతిభ లేకపోతే సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం సులభం కాదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రామ్‌చరణ్‌ (Ram Charan). ఆస్కార్‌ (Oscars) వేడుకల నుంచి తిరిగి వచ్చిన అనంతరం దిల్లీలో చర్చావేదికలో పాల్గొని నెపోటిజం, రాజకీయాలు తదితర అంశాల గురించి మాట్లాడారు. నెపోటిజంపై చర్చ వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ స్పందిస్తూ..‘ఈ నెపోటిజం ఏంటో నాకు అర్థమవ్వడం లేదు. ఎందుకు అందరూ అలా ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. ఒక జర్నలిస్టు కుమారుడు జర్నలిస్టు కావాలనుకున్నట్లే సినీ నటుడి తనయుడు సినీ రంగంలోకి రావాలనుకుంటాడని అర్థం చేసుకోవచ్చు. పిల్లలు తమ తల్లిదండ్రుల ధోరణీలోనే నడవాలకునేది ఎప్పటినుంచో ఉంది. ఒక సినీ నటుడి కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా ప్రతిభ లేకపోతే చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేవాడిని కాదు. నాకు చిన్నప్పటి నుంచీ నటన అంటే ఇష్టం. మా నాన్న వల్లే నేను ఈ పరిశ్రమకి వచ్చినప్పటికీ నాకు నేనుగా ముందుకు సాగాలి’ అని అన్నారు. క్రీడా నేపథ్యంలో సినిమా చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ఆ అవకాశమే వస్తే విరాట్‌ కోహ్లి బయోపిక్‌లో చేయాలనుకుంటున్నాన’ని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తారా? అని అడిగితే.. ‘నేను ఒకే పడవలో ప్రయాణించాలనుకుంటున్నాను. అది సినీ పరిశ్రమ మాత్రమే. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేద’ని చెప్పారు. హాలీవుడ్‌లో నటించడం గురించి మాట్లాడుతూ ‘నేను హాలీవుడ్‌లో అవకాశం వస్తే చేయాలనుకుంటున్నా’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని