Ram Charan: అలా చేయలేకపోతే నేను ఏం సాధించనట్టే: రామ్‌చరణ్
రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఇందులోని నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చరణ్ అమెరికాలో ప్రచారం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సినిమాకు సంబంధించి దర్శకుడి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోతే ఓ నటుడిగా తానేం సాధించనట్టే అని అభిప్రాయపడ్డారు ప్రముఖ హీరో రామ్‌చరణ్(Ram Charan). రాజమౌళి ‘నైస్’ అంటేనే పెద్ద ప్రశంస అని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న చరణ్ ప్రముఖ షో ‘టాక్ ఈజీ’లో మాట్లాడారు. ఎన్టీఆర్ (NTR)తో కలిసి తాను నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)లోని నాటు నాటు గీతం ఆస్కార్ (Oscar Awards 2023)కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్లిన చరణ్ హాలీవుడ్ ఎంట్రీతోపాటు ఎన్నో విశేషాలు పంచుకున్నారు.
* మీరు, ఎన్టీఆర్ కలిసి నటించడం ఇండియన్ సినిమా చరిత్రలోనే అసాధారణమైన విషయం. మీరు కలిసి నటించేందుకు ఏ అంశం ప్రభావితం చేసింది?
రామ్‌చరణ్: దానికి ముఖ్య కారణం దర్శకుడు రాజమౌళి. ఆయన ఏది చేసినా ప్రత్యేకమే. తన సినిమాలన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతాయి. ఆ క్రమంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’లో మేం భాగంకావాలనుకున్నాం. నా బ్రదర్ తారక్‌తో కలిసి నటించడం కిక్ ఇచ్చింది. వేరే దర్శకుడితో అయితే ఇది సాధ్యంకాదేమో అనుకుంటున్నా. ఇద్దరు హీరోలేకాదు పదిమంది హీరోలు కలిసి తెరను పంచుకున్నా ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపునివ్వగలరు రాజమౌళి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్క్రిప్టు, అందులోని పాత్రలూ మేం కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేలా చేశాయి.
* చిత్రీకరణ ఎలా జరిగిందో చెబుతారా?
రామ్‌చరణ్: ‘బాహుబలి’ సిరీస్ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఆయన సెట్స్‌లో చాలా సరదాగా ఉంటారు. ఏదైనా షాట్ అద్భుతంగా వచ్చినపుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుకునేవాళ్లం. ‘నైస్’ అనేదే ఆయన ఇచ్చే పెద్ద ప్రశంస. రాజమౌళినే కాదు ఏ దర్శకుడి మైండ్‌సెట్‌ను నేను అర్థంచేసుకోలేకపోతే ఓ నటుడిగా ఏం సాధించనట్టే. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో నేను పోషించిన రామరాజు పాత్రలో పలు షేడ్స్ ఉంటాయి. వ్యక్తిగతంగా నాకు బాగా దగ్గరైన క్యారెక్టర్ అది. పాండమిక్ వల్ల పదమూడు నెలలు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌లో ఓ రోజు రాజమౌళి నాకు ఫోన్ చేయగానే ‘వావ్ నన్ను ఓ మనిషి గుర్తించారు’ అని సంబరపడ్డా. యోగక్షేమాల గురించి అడిగి, తారక్‌కు కాన్ఫరెన్స్ కాల్ చేశారు. తర్వాత, వర్చువల్ క్లాస్‌లు ఎలా జరుగుతున్నాయో కనుక్కుంటూ మాలో స్ఫూర్తినింపేవారు.
* ‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్‌లో షూట్ చేశారు కదా. ఆ విశేషాలు?
రామ్‌చరణ్: అదొక సర్‌ప్రైజ్. మేం అక్కడకు వెళ్లి ఆ పాటను షూట్ చేస్తామని అనుకోలేదు. మా విజ్ఞప్తిని అంగీకరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రెసిడెన్సియల్ ప్యాలెస్‌లో చిత్రీకరణకు అనుమతి ఇచ్చారు. ఆ పాటకు డ్యాన్స్ చేసేందుకు చాలా కష్టపడ్డాం. అందులోని కొన్ని స్టెప్పులకు టేకులు మీద టేకులు తీసుకోవాల్సి వచ్చింది. కీరవాణి అందించిన సంగీతం అద్భుతం. అప్పుడు మేం పడిన కష్టం వల్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఉక్రెయిన్ ప్రజలు చాలా మంచి వారు. అక్కడి ఆహారం అద్భుతంగా ఉంటుంది. మా చిత్రీకరణ పూర్తైన మూణ్నెళ్లకు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టింది. అలా జరగడం బాధాకరం.
* మీ తండ్రి చిరంజీవి ప్రభావం బాల్యంలో మీపై ఎలా ఉండేది?
రామ్‌చరణ్: నాన్నకు అభిమానులు ఇచ్చిన కానుకలుసహా సినిమాలకు సంబంధించిన మ్యాగజైన్లను ఇంట్లోకి తీసుకొచ్చేవారు కాదు. అవన్నీ ఆఫీసుకే పరిమితమయ్యేవి. ఇంట్లో గ్లామర్ ఫీల్డ్ వ్యక్తిగా, ఓ స్టార్‌గా కాకుండా సాధారణ వ్యక్తిగా ఉండేవారు. నేను ఏ స్కూల్‌లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవాణ్ని కాదు. అలా 8 స్కూల్స్, 3 కాలేజీలు మారా. ఆటల్లో చురుకుగా ఉండేవాణ్ని. దాంతో, పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చేవి. మ్యాథ్స్, హిస్టరీ సబ్జెక్ట్స్ నాకు బాగా ఇష్టం. నా ఫ్రెండ్ రానా (హీరో), నేను కంబైండ్ స్టడీస్ పేరుతో మా బాల్కనీలో కాసేపు ఉండి, ఆ తర్వాత అక్కడ నుంచి పక్కింటిలోని గార్డెన్‌లోకి జంప్ అయ్యేవాళ్లం.
* టాలీవుడ్, బాలీవుడ్ అనే భేదం ఇప్పుడు లేనట్టేనా?
రామ్‌చరణ్: ఇండియాలోని ప్రతి రాష్ట్రం దేనికదే ప్రత్యేకం. ప్రాంతాన్ని బట్టి భాష, సంస్కృతి మారతాయి. ప్రతి రాష్ట్రంలో సినిమాలు రూపొందుతాయి. అయితే, ఉత్తరాది, దక్షిణాది అనే మాటను పోగొట్టి, ఇండియన్ సినిమా ఒక్కటే అని చాటిచెప్పేలా రాజమౌళి సహా మేమంతా కృషి చేస్తున్నాం. మేం బాలీవుడ్‌లోకి వెళ్లాలన్నా.. హిందీ దర్శకుడు దక్షిణాదిలో సినిమా చేయాలన్నా ఒకప్పుడు అసాధ్యమనిపించేది.
* ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు? విదేశీ చిత్రాల్లో నటించే అవకాశం ఉందా?
రామ్‌చరణ్: ‘టర్మినేటర్’, ‘గ్లాడియేటర్’, ‘బ్రేవ్‌హార్ట్’ తదితర హాలీవుడ్ చిత్రాలు వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. నటుడిగా అన్ని దేశాల చిత్రాల్లో నటించాలనుంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. కొన్ని నెలల్లో నా హాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన వార్త వస్తుంది. జులియా రాబర్ట్స్ నా ఫేవరెట్ నటి. అతిథి పాత్రలోనైనా ఆమెతో కలిసి ఓ సినిమాలో నటించానుంది.
* మీరు చేపట్టే దీక్ష గురించి చెబుతారా?
రామ్‌చరణ్:15 సంవత్సరాల నుంచి నేను దీక్ష చేపడుతున్నా. దైవ చింతనే ప్రధానంగా జీవించేందుకు మేం అలా చేస్తుంటాం. 48 రోజుల వ్యవధి ఉండే దీక్షలో ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తాం. మాంసాహారం ముట్టుకోం. నేలపైనే పడుకోవాలి, చన్నీళ్ల స్నానమే చేయాలి. మహిళలను తాకకూడదు. ఎలాంటి లగ్జరీ లేకుండా బతకాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా మారేందుకు దీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi Sanjay: తెదేపా, భాజపా పొత్తు వ్యవహారం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ts-top-news News
JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ కొంత కఠినమే..
-
Ap-top-news News
Tirumala: శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానం
-
Sports News
Lionel Messi: చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా