Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’గా రామ్‌చరణ్‌.. అదరగొట్టేలా టైటిల్‌ లోగో

మెగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటిస్తోన్న కొత్త చిత్రం టైటిల్‌ విడుదలైంది.

Updated : 27 Mar 2023 15:50 IST

హైదరాబాద్‌: మెగా అభిమానులందరూ ఆశగా ఎదురుచూస్తోన్న తరుణం వచ్చేసింది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటిస్తోన్న కొత్త సినిమా టైటిల్‌ విడుదలైంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం ఉదయం చిత్రబృందం టైటిల్‌ను ప్రకటించింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తోన్న చిత్రమిది. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు