Ram Charan: ఆ సినిమా ఫలితం తర్వాత వారం రోజులు ఎంజాయ్‌ చేశా: రామ్‌చరణ్‌

సినిమా ఫలితాలపై ఎక్కువగా ఆలోచించనని రామ్‌చరణ్ చెప్పారు. తన బాధ్యతలకు వందశాతం న్యాయం చేయడం ముఖ్యమన్నారు.

Published : 17 Jun 2024 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం కెరీర్‌తో పాటు.. ఫ్యామిలీ టైమ్‌ను కూడా ఎంజాయ్‌ చేస్తున్నారు స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan). కుమార్తెతో సమయం గడుపుతూనే సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చరణ్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమా ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించనని చెప్పారు. ఇండస్ట్రీలో చిరంజీవి (Chiranjeevi) వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఒత్తిడికి గురవుతారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు.

‘ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందనప్పుడు కూడా నేను రిలాక్స్‌ కావడం కోసం పార్టీ చేసుకుంటాను. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన తర్వాత వారం రోజులు ఇంటినుంచి బయటకు రాలేదు. కుటుంబంతో ఎంజాయ్‌ చేశాను. వారసత్వం గురించి ఎక్కువగా ఆలోచించను. ప్రస్తుతం ఏం జరుగుతుందో దానిపైనే దృష్టిపెడతాను. అదే నాకు ముఖ్యం. ఒక తండ్రిగా, కుమారుడిగా, సోదరుడిగా ఈరోజు నా బాధ్యతలకు పూర్తిగా న్యాయం చేయగలిగానా, లేదా అనేది ముఖ్యం. ప్రతిరోజు ఇలాగే ఆలోచిస్తాను’ అని చెప్పారు.

దర్శన్‌పై హత్య కేసు.. కిచ్చా సుదీప్ ఏమన్నారంటే..?

రామ్‌చరణ్ ‘గేమ్‌ ఛేంజర్‌’తో (Game Changer) బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. కియారా అడ్వాణీ కథానాయిక. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత బుచ్చిబాబుతో ఓ చిత్రం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని